తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం, ధర్మారం గ్రామంలో వ్యసనాలకు బానిసైన తండ్రి పుల్లెపు నర్సయ్య (54)తో కుమార్తె వర్షిత గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి పెద్దదయింది. దీంతో ఆవేశంలో కుమార్తె కన్న తండ్రిపై రోకలి బండతో దాడి చేసి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నవీపేట్ ఎస్‌ఐ వినయ్ గ్రామానికి చేరుకొని ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలో తండ్రిని రోకలి బండతో కొట్టి చంపిన కుమార్తె
June 17, 2025
0
Tags