కొత్త పోప్‌గా కార్డినల్ రాబర్ట్ ప్రీవోస్ట్ ఎన్నిక

Telugu Lo Computer
0


రోమన్ కాథలిక్ చర్చి కొత్త పోప్‌గా అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ ఎన్నుకోబడ్డారు. అమెరికా నుండి పోప్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా రాబర్ట్ ప్రాన్సిస్‌ రికార్డు సృష్టించారు. రెండ్రోజుల సమావేశం తర్వాత సుమారు 133 మంది కార్డినల్స్‌ మూడింట రెండు వంతుల మెజారిటీతో రాబర్ట్‌ను పోప్‌గా ఎన్నిక చేశారు. కొత్త పోప్‌ ఎన్నిక పూర్తైనట్టు తెలియజేస్తూ సిస్టీన్ చాపెల్ పైనుంచి తెల్లటి పొగను విడుదల చేశారు. ఇక కొత్తగా ఎన్నికైన పోప్‌కు పోప్ లియో- XIVగా నామకరణం చేశారు. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ కాథలిక్ చర్చి కొత్త పోప్‌గా ఎన్నిక కావడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త పోప్‌గా ఎన్నికైన రాబర్ట్ ఫ్రాన్సిస్ ట్రంప్ అభింనందనలు తెలిపారు. అమెరికాకు చెందిన వ్యక్తి పోప్‌గా ఎన్నికవడం ఎంతో గౌరవంగా ఉందని ట్రంప్ అన్నారు. 69 ఏళ్ల వయస్సు గల రాబర్ట్ ఫ్రాన్సిస్ ఆమెరికాలొని చికాగోకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఇయన తన కెరీర్‌లో ఎక్కువ కాలం పెరూలో మిషనరీగా గడిపాడు. ఇక 2023లో ఇయన కార్డినల్ అయ్యారు. తాజాగా పోప్‌గా ఎన్నికైన ఇయన 14వ పోప్ లియోగా వ్యవహరించనున్నారు. రెండు వేల సంవత్సరాల చర్చి చరిత్రలో అమెరికాకు చెందిన వ్యక్తి పోప్‌ కావడం ఇదే తొలిసారి.

Post a Comment

0Comments

Post a Comment (0)