దేశవ్యాప్తంగా జరగాల్సిన సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. మే 9 నుంచి మే 14 మధ్య జరగాల్సిన మిగిలిన సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపింది. ప్రస్తుతం ఈ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు మరిన్ని పూర్తి వివరాల కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ icai.orgలో ద్వారా తెలుసుకోగలరు. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని పేపర్‌లను తిరిగి షెడ్యూల్ చేస్తామని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ధృవీకరించింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ఖరారు చేసి విడుదల చేస్తామని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు హామీ ఇచ్చింది.
సీఏ పరీక్షలు వాయిదా !
May 09, 2025
0
Tags