జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు!

Telugu Lo Computer
0


జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అలజడి దృష్ట్యా అక్కడినుంచి బయట ప్రాంతాలకు వెళ్లేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే జమ్మూ, ఉధంపుర్‌ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితులు, ప్రయాణికుల డిమాండ్‌ మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 'ఆపరేషన్‌ సిందూర్‌' తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్‌ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్‌ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్‌అవుట్‌ పాటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)