నటి సమంత నిర్మాతగా తీసిన "శుభం" చిత్రం ఇటీవల విడుదల అయ్యింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి కాన్సెప్ట్ తో మూవీలు చాలా వచ్చాయి . కానీ ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ జనాలు ట్విట్టర్ వేదిక స్పందిస్తున్నారు. చిత్రం కథ విషయానికోస్తే భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్ గా పని చేస్తూ ఉంటారు శ్రీను అతని ఫ్రెండ్స్. శ్రీవల్లి - ఫరీదా - గాయత్రి కి తెలుగు టెలివిజన్ సీరియల్ అంటే చాలా పిచ్చి. ఈ సీరియల్ లో ప్రసారమయ్యే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. అయితే రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే జన్మజన్మల బంధం అనే టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు వాళ్ళ భార్యను కదిలిస్తే ఏం జరుగుతుంది అనేది సినిమా కాన్సెప్ట్. అంతేకాదు మధ్యలో దయ్యం కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తో అదే విధంగా హారర్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లారు. అంతేకాదు వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తూ చూసే మూవీ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ సినిమాలో సమంత ఇచ్చిన గెస్ట్ అపీరియన్స్ బాగా హైలైట్ గా మారింది .సోషల్ మీడియాలో శుభం సినిమాకి సంబంధించిన రివ్యూ బాగా ట్రెండ్ అవుతుంది.
సమంత నిర్మాతగా తీసిన "శుభం" చిత్రానికి పాజిటివ్ టాక్ !
May 09, 2025
0
Tags