తిరుమల ఆలయంపై విమానాల చక్కర్లు

Telugu Lo Computer
0


తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానాలు వెళ్లడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయం మీదుగా మూడు విమానాలు వెళ్లాయి. ఆనంద నిలయం మీదుగా విమానాల సంచారం తిరుమల ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధం. అయినా తరుచుగా విమానాలు, డ్రోన్లు కొండపై కనిపిస్తున్నాయి. ఇండియా పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో విమానాలు తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా తిరగడంపై టీటీడీ భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. గురువారం ఉదయం కూడా ఓ విమానం స్వామివారి ఆలయం మీదుగా చక్కర్లు కొట్టింది. ఇప్పటికే తిరుమల ఉగ్రవాదుల హిట్‌లిస్ట్ లో ఉందన్న వార్తల నేపథ్యంలో తరచూ విమానాలు తిరగడం అటు అపచారంతో పాటు ఇటు భక్తుల ఆందోళనకూ కారణమవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)