దేశంలో విమానాల రద్దు, దారి మళ్లింపు

Telugu Lo Computer
0


పరేషన్ సింధూర్ వేళ కేంద్రం అప్రమత్తం అయింది. ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. దీని లో భాగంగా పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసి వేసింది. కొన్ని విమానాలను రద్దు చేయటంతో పాటుగా మరి కొన్ని విమానాలను దారి మళ్లించింది. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లోని 20 విమానాశ్రయాలు మే 10వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సరిహద్దులో ఉద్రిక్తతలతో ఉత్తర, పశ్చిమ భారత ప్రాంతంలో గగనతలం మూసివేశారు. దీంతో మే 10వ తేదీ, శనివారం వరకు దాదాపు 20 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. ప్రయాణికుల భద్రతా కారణాల దృష్ట్యా విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వివిధ విమానయాన సంస్థలు పేర్కొన్నాయి.పాకిస్తాన్ ఆకాశమార్గం మీదుగా విమానాలను నిలిపివేశాయి. కొన్ని విమానయన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. లెహ్, శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, పఠాన్‌కోట్, చండీగఢ్, జోధ్‌పూర్, జైసల్మేర్, జామ్‌నగర్, భటిండా, భుజ్, ధర్మశాల, సిమ్లా, రాజ్‌కోట్, పూర్‌బందర్, బికానెర్, హిండన్, కిషన్‌గఢ్, కాండ్లా, గ్వాలియర్‌ ఈ ప్రాంతాల్లో విమానాశ్రయాలను మూసివేయనున్నారు. అమృత్‌సర్‌కు వెళ్లాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించామని ఎయిర్ ఇండియా తెలిపాయి. డచ్ ఎయిర్‌లైన్స్ కేఎల్ఎం తన ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ఢిల్లీ విమానానికి గంట ఎక్కువ సమయం పడుతుందని, ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ముంబై విమానాన్ని ఒక గంట 15 నిమిషాలు పొడిగించినట్లు పేర్కొన్నాయి. ఈ రెండు మార్గాలు నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉంటాయని ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు తెలిపాయి. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు వెళ్లే విమానాలను మే 10వ తేదీన ఉదయం 5.29 గంటల వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించింది. ప్రయాణికులు రీషెడ్యూల్ చేసుకోవాలని, లేదా నగదును వాపస్ తీసుకోవ్చని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఎయిర్ ఇండియాను సంప్రదించవచ్చని సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)