కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తాము : అఖిలపక్షం

Telugu Lo Computer
0


రోజు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలకు సిందూర్ ఆపరేషన్ గురించి వెల్లడించింది. రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌షా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అయితే, ఈ ఆపరేషన్ లో దాదాపుగా వంద మందికి పైగా ఉగ్రవాదుల హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, అసదుద్దీన్ ఓవైపీ,తదితర విపక్ష నేతలు హాజరయ్యారు. గంటన్నరపాటు అఖిలపక్ష భేటీ జరిగింది. ఆపరేషన్ సిందూర్‌, సరిహద్దు భద్రతా వివరాలను రాజ్‌నాథ్ సింగ్ నేతకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామని అన్ని పార్టీలు చెప్పాయి. కేంద్రానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)