ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ అయ్యారు. సరిహద్దు గ్రామాల్లోని ప్రజల భద్రతపై వీరు చర్చించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై గోవింద్ మోహన్‌తో మోదీ చర్చించారు. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 13 మంది పౌరులు మృతి చెందగా.. 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 44 మంది పూంఛ్ సెక్టార్‌కు చెందినవారుగా అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఓ జవాను కూడా ఉన్నారు. పాక్ షెల్లింగ్‌లో గాయపడి 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధ్రువీకరించింది.
ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ
May 08, 2025
0
Tags