గోల్డెన్ వీసా ఉంటే ఏకంగా పదేళ్ల పాటు యూఏఈలో హాయిగా ఉండొచ్చు !

Telugu Lo Computer
0


గోల్డెన్ వీసా ఉంటే ఏకంగా పదేళ్ల పాటు యూఏఈలో హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కువ మందికి ఈ అవకాశం కల్పిస్తూ యూఏఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2019లోనే యూఏఈ ఈ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. మంచి టాలెంట్ ఉన్నవాళ్లను, పెట్టుబడి పెట్టేవాళ్లను తమ దేశంలో ఉంచుకోవాలనేది వాళ్ల ప్లాన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించారు. తాజాగా ఐదు కొత్త కేటగిరీ కింద కూడా గోల్డెన్ వీసా దక్కించునే ఛాన్స్ ఇచ్చింది. దుబాయ్‌లో 15 ఏళ్లకు పైగా నర్సులుగా పనిచేసిన వాళ్లకు యూఏఈ 10 ఏళ్ల గోల్డెన్ వీసా ఇస్తోంది. అంతేకాదు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసే మంచి టీచర్లకు కూడా ఈ వీసా వర్తిస్తుంది. టాలెంట్ చూసి విద్యా ప్రమాణాలు పెంచడంలో హెల్ప్ చేస్తే చాలు. సోషల్ మీడియాలో వీడియోలు చేసేవాళ్లు, సినిమాలు తీసేవాళ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా గోల్డెన్ వీసాకు అప్లై చేసుకోవచ్చు. వీళ్లకు స్పాన్సర్ కూడా అవసరం లేదు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ అవకాశాన్ని ప్రవేశపెట్టారు. ఇ-స్పోర్ట్స్ ప్లేయర్లు, గేమింగ్ ప్రొఫెషనల్స్‌కు కూడా యూఏఈ తలుపులు తెరిచింది. దుబాయ్ ప్రోగ్రామ్ ఫర్ గేమింగ్ 2033లో భాగంగా ఈ ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే వీళ్లకు కనీసం 25 ఏళ్లు ఉండాలి. లగ్జరీ షిప్స్ ఉన్నవాళ్లకు కూడా గోల్డెన్ వీసా ఇస్తున్నారు. కనీసం 40 మీటర్ల పొడవున్న ప్రైవేట్ బోటు ఉంటే చాలు. ఈ వీసా బోట్ల తయారీదారులు, ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్లకు కూడా వర్తిస్తుంది. మొత్తానికి యూఏఈ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్‌తో ప్రపంచంలోని టాలెంట్ మొత్తాన్ని దాని దగ్గరికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఒకప్పుడు కేవలం పెద్ద బిజినెస్ చేసేవాళ్లకు మాత్రమే ఈ వీసా వచ్చేది. కానీ ఇప్పుడు ఎన్నో రంగాల వాళ్లకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)