మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షాపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం !

Telugu Lo Computer
0


పరేషన్‌ సిందూర్‌ సమయంలో కీలకంగా వ్యవహరించిన సైనికాధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగు గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆదేశించినట్లు సమాచారం. ఓ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా మాట్లాడుతూ సైనికాధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషీ పేరును పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేస్తే వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోడీజీ పంపించి గుణపాఠం నేర్పించారని అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అటు జాతీయ మహిళా కమిషన్‌ కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు స్త్రీల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)