కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ గెలుపుతో మార్క్ కార్నీ ప్రధానిగా కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ సారి భారత సంతతికి చెందిన 22 మంది ఎన్నిక కాగా నలుగురికి కార్నీ కెబినెట్లో స్థానం లభించింది. అనితా ఆనంద్ విదేశాంగ మంత్రిగా, మనీంద్ర సిధూ అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. రూబీ సహోతా, రణదీప్ సింగ్ సరాయ్ లు స్టేట్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. ఈ నలుగురిలో ముగ్గురు ఒంటారియో రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు.
మార్క్ కార్నీ కేబినెట్ లో భారత సంతతికి చెందిన నలుగురికి స్థానం !
May 14, 2025
0
Tags