ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన తుర్కియే, అజర్‌బైజాన్‌లపై మన దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మన ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఆ రెండు దేశాలకు ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించాయి. దీంతో కొత్త బుకింగ్‌లు 60శాతం పడిపోయాయని, క్యాన్సలేషన్‌లు 250 శాతానికి చేరినట్లు ట్రావెల్ సంస్థ 'మేక్ మై ట్రిప్' వెల్లడించింది. ''తుర్కియే, అజర్‌బైజాన్‌లకు బాయ్‌కాట్ నినాదం ప్రభావం గత వారం రోజులుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు దేశాలకు బుకింగ్‌లు 60శాతం తగ్గగా, రద్దు చేసుకునే వారి సంఖ్య 250 శాతం పెరిగింది. మన దేశానికి సంఘీభావంతోపాటు మన సాయుధ బలగాలపై గౌరవంతో పర్యటకుల నిర్ణయాన్ని మేమూ గౌరవిస్తున్నాం'' అని మేక్‌మైట్రిప్ వెల్లడించింది. అత్యవసర ప్రయాణాలను మాత్రమే సూచిస్తున్నాం. మరోవైపు ఈజీమైట్రిప్ సంస్థ కూడా ఈ రెండు దేశాలకు సంబంధించి ఇటువంటి ప్రకటనే చేసింది. గత వారం రోజులుగా తుర్కియేకు 22శాతం, అజర్‌బైజాన్‌కు 30శాతం క్యాన్సలేషన్‌లు నమోదైనట్లు పేర్కొంది. అయితే, ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌లకు రద్దు చేసుకోవద్దని ఆయా ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు పేర్కొన్నప్పటికీ.. పర్యటకులు మాత్రం అక్కడికి వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.
తుర్కియేకు 250% పెరిగిన క్యాన్సలేషన్లు !
May 14, 2025
0
Tags