విటమిన్ B12 అనేది నీటిలో కరిగే విటమిన్. ఇది మాంసం, చేపలు, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి జంతువుల నుండి పొందిన ఆహారాలలో లభిస్తుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, డీఎన్ఏ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. శాకాహారుల్లో విటమిన్ బి12 లోపం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కొందరు మాంసాహారుల్లో విటమిన్ బి12 శోషణ సరిగ్గా జరగదు. అందువల్ల కూడా ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. పలు రకాల మందులను వాడే వారిలోనూ విటమిన్ బి12 లోపం వస్తుంది. అలసట, బలహీనత, పాలిపోయిన చర్మం, సమతుల్యతను కాపాడుకోవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత కోల్పోవడం, రక్తహీనత వంటివి విటమిన్ బి12 లోపించిందని చెప్పేందుకు కారణాలు. విటమిన్ బి12 లోపిస్తే నరాలు దెబ్బ తింటాయి. గుండె జబ్బులు వస్తాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కోల్పోతారు. కొందరికి మతి స్థిమితం ఉండదు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అంటు వ్యాధులతో శరీరం పోరాడలేక చేతులెత్తేస్తుంది. దీంతో వ్యాధులు మరింత తీవ్రతరం అవుతాయి. విటమిన్ B12 లోపాన్ని నివారించడానికి మాంసం, చేపలు, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను తీసుకోవాలి. అలాగే డాక్టర్ సూచన మేరకు విటమిన్ B12 సప్లిమెంట్ తీసుకోవాలి. దీన్ని ఒక కోర్సులాగా వాడమని చెబుతారు. అప్పుడు శరీరంలో పైన తెలిపిన లక్షణాలు అన్నీ తగ్గుతాయి. ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
విటమిన్ B12 లోపంతో కలిగే అనర్థాలు !
May 24, 2025
0
Tags