కర్నాటకలో ఓ అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు నింధితులు ఈ నెల 20న విడుదలయ్యారు. వారికి కొందరు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. రోడ్డుపై విజిల్స్ వేస్తూ కేకలు వేస్తూ హంగామా చేశారు. కారులో నిలుచుని నింధితులు చేతులు ఊపుతూ ఫుల్ కుషీగా ఎంజాయ్ చేశారు. రాష్ డ్రైవింగ్ చేస్తూ వీధుల్లో రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు ఇంత సంతోషంగా ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఉన్నారంటే మళ్లీ ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తారని మండిపడ్డారు. తిరిగి జైలుకు పంపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో నిందితులపై మళ్లీ కేసులు నమోదయ్యాయి. హవేరీ జిల్లా సూపరిండెండ్ పోలీస్ అన్షు కుమార్ శ్రీవాస్తవ ఘటనపై స్పందించారు. ర్యాలీలో పాల్గొన్నవారిపై రౌడీ షీట్ బుక్ చేశామని చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్‌తో పాటూ పలు కేసులు నమోదు చేశామన్నారు. నింధితులకు బెయిల్ రద్దు చేసి తిరిగి జైలుకు పంపాలని కోర్టులో దరఖాస్తు దాఖలు చేశామని అన్నారు. ఇదిలా ఉంటే నింధితులు సైముల్లా లాలాన్వార్, మొహమ్మద్ సాధిక్ అగాసిమని, సోయబ్ ముల్లా, రియాజ్ సావికేరీ 26ఏళ్ల యువతిపై సామాహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గతేడాది జనవరిలో వీరిపై కేసు నమోదు అవ్వగా జైలుకు వెళ్లారు. తిరిగి వచ్చినా బుద్ధి మారకపోవడంతో మళ్లీ ఊసలు లెక్కపెట్టాల్సిన వచ్చింది.
రేపిస్టులకు గ్రాండ్ వెల్‌కమ్ ర్యాలీలో పాల్గొన్నవారిపై రౌడీ షీట్ బుక్
May 24, 2025
0
Tags