అమెరికా విధించిన 'ప్రతీకార' సుంకాలను వెంటనే రద్దు చేయాలి : చైనా

Telugu Lo Computer
0


తమ దేశ దిగుమతులపై విధించిన 'ప్రతీకార' సుంకాలను వెంటనే రద్దు చేయాలని చైనా అమెరికాను కోరింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ట్రంప్‌ చర్య గత కొన్ని సంవత్సరాలుగా బహుపాక్షిక వాణిజ్య చర్చలలో కుదిరిన ఒప్పందాల ప్రయోజనాల సమతుల్యతను దెబ్బతీస్తోందని చైనా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా చాలాకాలంగా ఎంతో ప్రయోజనం పొందిందనే వాస్తవాన్ని విస్మరించిందని మండిపడింది. బుధవారం ట్రంప్‌ చైనాపై 34 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు, ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన విధించిన 20 శాతం సుంకానికి అదనంగా, నూతనంగా విధించిన 34 శాతంతో చైనా దిగుమతులపై విధించిన మొత్తం సుంకాలు 54 శాతానికి చేరుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ బెదిరించిన 60 శాతానికి దగ్గరగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ప్రతీకార సుంకాలను విధించారు. మిత్రదేశాలు, ప్రత్యర్థులను ఒకే విధంగా సవాలు చేస్తూ ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్‌లో నిర్వహించిన 'మేక్‌ అమెరికా ఎగైన్‌ వెల్త్‌ ' కార్యక్రమంలో సుంకాల జాబితాను ప్రకటించారు. అమెరికా 'లిబరేషన్‌ డే' గా అభివర్ణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)