రూ.కోటి విరాళం చెల్లించే భక్తులకు జీవితకాలం శ్రీవారి దర్శనం : టీటీడీ

Telugu Lo Computer
0


శ్రీవారికి కోటి రూపాయలు విరాళం చెల్లించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది. జీవితకాలం దాతతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులకు ప్రతి ఏడాది సౌకర్యాలు ప్రత్యేకంగా కల్పిస్తోంది. ఇందులో మూడు రోజుల పాటు సుప్రభాత సేవ, మూడు రోజులు బ్రేక్ దర్శనం, నాలుగు రోజులపాటు సుపాద సేవ దర్శనం కూడా కల్పిస్తున్నారు. వీటితో పాటు భక్తులకు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, ఒక్క జాకెట్‌, మహా ప్రసాదం ప్యాకెట్లు 10, ఒక దుప్పట వేద ఆశీర్వచనం కూడా పొందే అవకాశం లభిస్తుంది. వీటితోపాటు  రూ.3000 రూపాయల విలువైన వసతి గదిని కూడా మూడు రోజులపాటు కేటాయిస్తారు. మొదట కోటి రూపాయలు చెల్లించిన భక్తులకు తెల్లవారుజామున మొదలెయ్య సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా స్వామివారి సేవలో పాల్గొనవచ్చు. ఇందులో తోమాల, అర్చన, ఆష్టాపద పద్మారాధన, సహస్రదీపాలంకరణలో కూడా పాల్గొనే అవకాశం గతంలో కల్పించేవారు ప్రస్తుతం జీవిత కాలం కల్పిస్తున్నారు. వీరికి ఒకసారి 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ కూడా అందిస్తారు. దీంతోపాటు 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను కూడా పొందవచ్చు. అయితే రూ.కోటి రూపాయలు చెల్లించే భక్తులు ప్రధానంగా ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఎస్ వి విద్యా దాన ట్రస్టు, కాటేజ్ డొనేషన్స్ స్కీమ్, బర్డ్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, సర్వ శ్రేయస్ ట్రస్టు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు, శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు దాతాలు విరాళాలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాళ్లు ప్రత్యేకంగా ఒక రిసిప్ట్ కూడా జారీ చేస్తారు. వాటితో సకల సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. రూ.కోటి రూపాయలు చెల్లించడానికి సన్నద్ధమైన భక్తులు www.ttddevasthanam.ap.gov.in ఆన్లైన్ ద్వారా ఈ అధికారిక వెబ్సైట్లో చెల్లించవచ్చు. ఆఫ్లైన్లో కూడా దాతలు టీటీడీ ఈవో పేరిట డిడి లేదా చెక్ ని తీసుకొని తిరుమల లోని దాతల విభాగంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తిరుమల దేవస్థానం అధికారికంగా ప్రకటన చేసింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)