గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు మరోమారు రికార్డ్ స్థాయిలో పెరిగింది, $3175ను చేరింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 3,173 డాలర్ల దగ్గర ఉంది. ఈ రోజు మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 930 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 850 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 690 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు రూ. 1000 పెరిగింది. ఈ రోజు పన్నులతో కలుపుకుని, 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ (24K) రేటు రూ. 95,000 వద్దకు చేరుకుని నూతన రికార్డ్ లిఖించింది. ఆ తర్వాత కాస్త చల్లబడింది. ప్రస్తుతం, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 94,200 వద్ద ఉంది. కిలో వెండి రూ. 1.05,000 దగ్గర కదులుతోంది.
రూ.95,000 చేరిన బంగారం ధర
April 01, 2025
0
Tags