తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర

Telugu Lo Computer
0


వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. 19కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.41 తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1803 నుంచి రూ. 1762కు తగ్గింది. తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ముంబైలో కమర్షియల్ (19కేజీల) గ్యాస్ సిలిండర్ ధర రూ.1,714.50కి లభిస్తుంది. కోల్ కతాలో రూ.1,872కి చేరుకుంది. చెన్నైలో గతంలో రూ.1,965.50కాగా.. ప్రస్తుతం రూ.1924.50కి చేరుకుంది. హైదరాబాద్ లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.44 తగ్గింది. దీంతో నిన్నటి వరకు రూ.2,029గా ఉన్న ధర రూ.1,985.50కు తగ్గింది. విశాఖపట్టణంలో 19కేజీల ఎల్పీజీ సిలిండర్ రేటు రూ.44.50 తగ్గింది. దీంతో ప్రస్తుత ధర రూ.1,817కు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)