రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రేనియన్ పైలట్లకు ఫ్రాన్స్ శిక్షణ నందిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 25న ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆల్ఫా జెట్ విమానాలతో ట్రైనింగ్ జరిగింది. ఈ క్రమంలో గాలిలో విన్యాసాలు చేస్తుండగా, రెండు జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఒక విమానం కూలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఇద్దరు పైలట్లు, ఒక వ్యక్తి పారాచూట్ల సహాయంతో ఆ విమానం నుంచి బయటపడ్డారు. వారు ఎత్తునుంచి కిందపడినందున తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురు స్పృహతప్పినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని వెల్లడించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గాలిలో విన్యాసాలు చేస్తుండగా రెండు జెట్ విమానాలు ఢీ : వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
March 26, 2025
0
Tags