హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి 'ఇండియా ఆర్ట్ ఫెస్టివల్' (ఐఏఎఫ్) నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి విభిన్న నగరాల నుంచి ప్రముఖ ఆర్టిస్టులు ఈ కళా ఉత్సవంలో తమ కళలను ప్రదర్శించనున్నారు. 2011 నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో నిర్వహించే ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ రెండో ఎడిషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్ ఫెస్టివల్‌తో పాటు ఫ్యూజన్ షోలు, లైవ్ మ్యూజిక్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 'ది ఎటర్నల్ కాన్వాస్ - 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్' ప్రదర్శన హైలైట్‌గా నిలువనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రదర్శనలో ప్రతి రాష్ట్రం నుంచి కళాకారులు పాల్గొనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండిషన్డ్ స్టాల్స్, దేశవ్యాప్తంగా 50 మంది దిగ్గజ కళాకారులతో పాటు దాదాపు 200 మంది ప్రముఖ, యువ, ఔత్సాహిక కళాకారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన పెయింటింగ్స్, శిల్పాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆర్ట్ ఫెస్టివల్ రేతిబౌలి (మెహదీపట్నం) పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 68 దగ్గరున్న కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకూ 11:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకూ కొనసాగుతుంది.
ఏప్రిల్ 4 నుంచి హైదరాబాద్ వేదికగా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ !
March 26, 2025
0
Tags