ఏప్రిల్ 06న ''పంబన్'' వంతెన ప్రారంభం !

Telugu Lo Computer
0


మిళనాడు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని ఏప్రిల్ 06న శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ  సందర్శించి  ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదే రోజు కొత్త 'పంబన్ బ్రిడ్జ్'ని ప్రారంభిస్తారు. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తుంది. సముద్రంలో ఉన్న పాత వంతెన తుప్పు పట్టడంతో 2022లో మూసేశారు. 1914లో నిర్మించిన ఈ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 2024లో ''భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే వంతెన'' అని దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొత్త వంతెన 2.5 కి.మీ పొడవు ఉంది. దీనిని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్  రూ. 535 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇది హైస్పీడ్ రైళ్లు, పెరిగిన ట్రాఫిక్‌కి అనుగుణంగా నిర్మించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)