తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉన్న ఆహారం - ఆరోగ్య ప్రయోజనాలు

Telugu Lo Computer
0


రైస్, చపాతిలలో అధిక కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి, ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతోంది. చపాతి సైతం గోధుమ పిండితో తయారు చేసిన చపాతిని రాత్రి తీసుకున్నా బరువు పెరుగుతారు. అంతేకాదు అసిడిటీ, నిద్రలేమి తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు రాత్రి తేలికైన ఆహారాన్ని సిఫారసు చేస్తున్నారు. చపాతి కంటే జొన్న, రాగి రొట్టెల వల్ల అధిక మేలు జరుగుతోందని చెబుతున్నారు. జొన్నలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువ, జీర్ణం సులభంగా జరుగుతోంది. రాగి రొట్టెలో కాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది, రక్తహీనతను నియంత్రిస్తుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్వల్పంగా ఉంటుంది. దీంతో రాత్రి తినడానికి ఈ ఆహారం అనువైనది.  ఉడికించిన కూరగాయలు, క్యారెట్, బీన్స్, బీట్‌రూట్‌తోపాటు ఓట్స్ ఉప్మా రాత్రికి అత్యంత ఆరోగ్యకరమైనది. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే తేలికగా జీర్ణమవుతుంది.  మొలకెత్తిన పెసర్లు, శనగలు సైతం తేలికగా జీర్ణమవుతుంది. ఇది కూడా పోషకాల గనీ. రాత్రి పూట ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే నిద్ర సైతం గాఢంగా పడుతుంది. అదే విధంగా బరువు పెరగకుండా కాపాడతాయి. రాత్రిపూట తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)