పార్టీ కార్యకర్తల మరణానికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాను !

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో మాజీ ప్రధాని షేక్ హసీనా జూమ్‌కాల్‌ ద్వారా హాజరై మాట్లాడుతూ అమాయక ప్రజల మీద జరుగుతున్న దాడులకు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దోషి అని, మహమ్మద్‌ యూనస్‌ ఓ ఉగ్రవాది అని, తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. అవామీ లీగ్‌ పార్టీ నాయకులు ఓపికగా ఐక్యంగా ఉండాలన్నారు. ప్రణాళికతోనే తన తండ్రి నివాసాన్ని నాశనం చేశారని ఆరోపించారు హసీనా. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా అల్లర్లు ఆగలేదు. దేశ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో ఉందని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనల కారణంగా 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ను వీడారు షేక్‌ హసీనా. హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)