బాబా డెంబ్ సరస్సు పక్కనున్న అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం !

Telugu Lo Computer
0


మ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ సిటీలో బాబా డెంబ్ సరస్సు పక్కనున్న అటవీ ప్రాంతంలో ఈ మధ్య తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. కాగా ఆ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)