మాంసాహారంలో అధిక కొవ్వులేని ఆహారం చేపలు. ఎండు చేపలను వాసన పడక ఎక్కువ మంది తినరు. అయితే వీటిలో 80-85 శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు ఉన్నవారికి ఎండు చేప కూర చాలా మంచిది. మూత్రాశయం, అండాశయం, గర్భాశయం లాంటి సమస్యలు మహిళలకు ఎక్కువగా వస్తాయి వాటిని పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. ఎండు చేప వాతం, పిత్తం, రక్త ప్రసరణ లాంటి సమస్యలను నయం చేస్తుంది. పాలిచ్చే తల్లులు ఎండు చేప తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎండు చేప తినకూడదు. రక్తపోటు, షుగర్ ఎక్కువగా ఉన్నవారు ఎండు చేపను ముట్టుకోకూడదు. చర్మ సమస్యలు లేదా అలెర్జీలు ఉన్నవారు కూడా ఎండు చేపను తినకూడదు. అలా తింటే దద్దుర్లు, దురద, పొక్కులు లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండు చేప తినేటప్పుడు మజ్జిగ, పెరుగు, ఆకుకూరలు లాంటి ఆహారాలను తినకూడదు. ఇది శరీరానికి హానికరం. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చు. తలకు నూనె రాసుకుని స్నానం చేసే రోజున ఎండు చేప తినకూడదు. ముఖ్యంగా సైనస్ సమస్య, జలుబు, దగ్గు, ఆస్తమా సమస్య ఉన్నవారు తలకు నూనె రాసుకుని స్నానం చేసిన తర్వాత ఎండు చేప తింటే సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎండు చేపలు - మంచి - చెడులు !
February 04, 2025
0
Tags