ప్రెజర్ కుక్కర్‌ - అపోహలు

Telugu Lo Computer
0


ప్రెజర్ కుక్కర్‌లో ఆహారం వండటం వల్ల పోషకాలు నాశనం అవుతాయని చాలా మంది అనుకుంటారు. ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల పోషకాలు తగ్గిపోవు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్‌కు మూసివున్న మూత ఉంటుంది. నీరు లోపల మరిగి ఆవిరిగా మారుతుంది కానీ కుక్కర్ నుండి ఏవీ బయటకు రావు. ఇది ఎక్కువ నీరు ఆవిరైపోకుండా నిరోధిస్తుంది. ఫలితంగా, ఆహారం చాలా వేగంగా ఉడుకుతుంది. అన్ని వంట పద్ధతులు కొన్ని పోషకాలను నాశనం చేస్తాయని, కానీ ప్రెజర్ కుకింగ్ మరింత సమర్థవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి చింత లేకుండా ప్రెజర్ కుక్కర్‌లో పప్పు, ఇతర వంటకాలను చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వంట పద్ధతులు తక్కువ ఉష్ణోగ్రతలు అవసరమయ్యేవని, వెన్న లేదా నూనె అవసరం లేనివని చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్‌లో ఆవిరి పట్టడం, ఉడకబెట్టడం వంటకు మంచిదని, ఎలాంటి పోషక నష్టాన్ని కలిగించవని నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)