మహా కుంభమేళాను పొడిగించండి : అఖిలేష్‌ యాదవ్‌

Telugu Lo Computer
0


ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు ఇప్పటిదాకా 50 కోట్ల మంది హాజరైనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇంకా కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో కుంభ మేళాను పొడిగించాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో మహా కుంభమేళా, కుంభమేళాల రద్దీ దృష్ట్యా 75 రోజులపాటు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి!. కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్న మహా కుంభమేళా తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని అఖిలేష్‌ అంటున్నారు. మహా కుంభమేళా కోసం ఎంతో మంది ఆశగా ప్రయాగ్‌రాజ్‌ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లను నిరాశపర్చడం సరికాదు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని అన్నారాయన.

Post a Comment

0Comments

Post a Comment (0)