టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు 'మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' అనే యుకె నైట్‌హుడ్ అవార్డు ప్రదానం చేయబడిందని యుకె ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. "ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు గౌరవనీయ కింగ్ చార్లెస్‌కు కృతజ్ఞతలు. టెక్నాలజీ, కన్జూమర్, హాస్పిటాలిటీ, ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్ రంగాలవ్యాప్తంగా యూకేతో పటిష్టమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం టాటా గ్రూప్‌నకు గర్వకారణం. జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ లాంటి మా ఐకానిక్ బ్రిటీష్ బ్రాండ్లు మాకెంతో గర్వకారణమైనవి. యూకేలో మా సంస్థల్లో 70,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వార్విక్ యూనివర్సిటీ, స్వాన్‌సీ యూనివర్సిటీ సహా ఈ దేశంలోని అనేక గొప్ప సంస్థలతో ప్రపంచ స్థాయి పరిశోధనలు, విద్యారంగంపరమైన భాగస్వామ్యాల ఫలాలను ఆస్వాదిస్తున్నాం. గ్రూప్‌నకు ఎనలేని మద్దతును అందిస్తున్న యూకే ప్రభుత్వానికి టాటా గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యూకేతో మా పటిష్ట బంధాలను, మా కార్యకలాపాలను మరింతగా బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మక గుర్తింపుతో నన్ను గౌరవించినందుకు మరోసారి ధన్యవాదాలు" అని ప్రతిష్టాత్మకమైన ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (సివిల్ డివిజన్)ను అందుకున్న సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు.
ఎన్ చంద్రశేఖరన్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ నైట్‌హుడ్ అవార్డు
February 14, 2025
0
Tags