జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల నుండి విముక్తికి ఉల్లిపాయ !

Telugu Lo Computer
0


జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల నుండి విముక్తి పొందాడానికి ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలను ఒక గుడ్డసహాయంతో గట్టిగా పిండుకోవాలి. అలా పిండగా వచ్చిన ఉల్లి రసాన్ని జుట్టు కుదుళ్లకు రాయాలి. ఒక గంట ఆగి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఉల్లి చుండ్రును తగ్గించడమే కాకుండా జుట్టు రాలడం, జుట్టు చిట్లడం వంటి సమస్యల నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది. అతి చిన్న వయసులోనే కొందరికి జుట్టు తెల్లబడుతుంది దానికి కారణం మెలనిన్ పిగ్మెంట్ లేకపోవడమే. ఇటువంటి సమస్యలకు కూడా ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉండే ఉల్లి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు సమస్యలకే కాకుండా రక్త ప్రసరణకు కూడా ఉల్లి ఎంతో మేలు చేస్తుంది.ఈ చిట్కాలను పాటించడం వల్ల మీరు కోరుకున్న అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది అలాగే మీ అందం కూడా రెట్టింపు అవుతుంది..

Post a Comment

0Comments

Post a Comment (0)