అమెరికాలోని వాషింగ్టన్‌లో రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు వద్ద పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. గాల్లో మిలిటరీ హెలికాప్టర్‌ను ఢీకొన్న విమానం ఎయిర్ పోర్టు సమీపంలోని పోటోమాక్ నదిలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాన్సస్‌లోని విచితా సిటీ నుంచి వాషింగ్టన్‌కు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. గురువారం వాషింగ్టన్ సమీపంలోని రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే క్రమంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం, యుఎస్ ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొని నదిలో కూలిపోయింది. అనేక ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు పోటోమాక్ నది నుండి పద్దెనిమిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాన్సాస్‌లోని విచిత నుండి వాషింగ్టన్‌కు వెళుతున్న ప్యాసింజర్ జెట్‌లో అరవై మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ విమానాన్ని పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ నిర్వహించింది.
అమెరికాలో హెలికాప్టర్‌ను ఢీకొట్టిన విమానం
January 30, 2025
0
Tags