ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. యమునా నదిలో బీజేపీ విషం కలిపిందన్న ఆరోపణపై సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ఆయన వివరణను తోసిపుచ్చింది. ఆధారాలు, వాస్తవాలు కాకుండా సాధారణ వివరణ ఇచ్చారని వెల్లడించింది. స్పష్టత ఇవ్వకుండా జస్టిఫై చేస్తున్నారని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల లోపు మళ్లీ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వేర్వేరు అంశాలను కలపొద్దని సూచించింది.
అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల సంఘం ఆగ్రహం !
January 30, 2025
0
Tags