ఈ రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ. 150 పెరగ్గా తులం రూ. 76,100 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర తాజాగా రూ. 170 పెరగ్గా 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 83,020 వద్ద ఉంది. ఢిల్లీలో బంగారంధర హైదరాబాద్ కంటే ఎక్కువగానే ఉంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు ఇందుకు కారణంగా ఉంటాయి. ఢిల్లీలో 22 క్యారెట్స్ పుత్తడి ధర రూ. 76,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ. 170 ఎగబాకి తులం రూ. 83 వేల మార్కుకు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 96,500 వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 1.04 లక్షల వద్దే ఉంది.
83 వేలు దాటిన బంగారం ధర
January 30, 2025
0
Tags