రేప్ కేసులో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ అరెస్ట్

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని సీతాపూర్  కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ మహిళ తనపై నాలుగు సంవత్సరాలుగా పెళ్లి పేరుతో మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈనెల 17న ఆయనపై కేసు నమోదు చేశారు. మహిళ చేసిన ఆరోపణల ప్రకారం, రాకేశ్ రాథోడ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో అనేక సంవత్సరాలు సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదైన అనంతరం రాకేశ్ రాథోడ్ ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను నిన్న తిరస్కరించింది. కోర్టు తీర్పు తర్వాత, పోలీసులు వెంటనే రాకేశ్ రాథోడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి భర్త ఆరోపణల ప్రకారం రాకేశ్ రాథోడ్ తన అధికారాన్ని ఉపయోగించి కేసును ఉపసంహరించుకోమని  ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ కేసు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఎన్నికల వేళ తాము మహిళల సంక్షేమం గురించి మాట్లాడుతూనే, తమ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)