తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పన రెండు పూచికత్తులు, పాస్పోర్టు లను కూడా హ్యాండోవర్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అధికారులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, సాక్షాధాలను కూడా చెరిపి వేసేందుక ప్రయత్నం చేయకూడదని స్పష్టం చేసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును గత సంవత్సరం మార్చి 23న పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆగస్టు 19న ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం బెయిల్ గడవును పొడిగిస్తూ వచ్చింది. తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషనల్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో అయన నవంబర్ 14న తిరిగి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. అదేవిధంగా ఇదే కేసులో డీసీపీ రాధాకిషన్ రావును గత సంవత్సరం మార్చి 29 అరెస్ట్ అయ్యారు. అయితే, ఆయన మామగారు హఠాత్తుగా మరణించడంతో అనంతరం 2014. డిసెంబర్ 25న ఆయనకు హైకోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, తాజాగా వారి బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావులకు బెయిల్ మంజూరు
January 30, 2025
0
Tags