మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్నా మాతో చర్చలు జరిపేందుకు వ్లాదిమీర్ పుతిన్ భయపడుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా శక్తివంతమైన నేత భయపడుతున్నారు అని ట్వీట్ చేశారు. ఉక్రెయిన్-రష్యాల దేశాల యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరు దేశాదినేతలు యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి చర్చలు జరపాలని హితువు పలికారు. లేదంటే ఇరు దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికలపై పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా మార్షల్‌లా విధించిన జెలెన్‌స్కీతో తాము చర్చలు జరపబోమన్నారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు మేం సిద్ధం. జెలెన్‌స్కీ మాతో జరిగే చర్చల్లో పాల్గొంటే. నేను పాల్గొనను. మా తరుఫున ప్రతినిధుల్ని పంపిస్తాం. చర్చలు కూడా మాకు అనుకూలంగా జరగగాలి' అని వ్యాఖ్యనించారు. పుతిన్ నిర్ణయంపై జెలెన్ స్కీ మండి పడ్డారు. పుతిన్ స్వార్ధపరడు. మూడేళ్లుగా యుద్ధం జరగుతుంటే కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మాతో మాట్లాడేందుకు పుతిన్, అదే అత్యంత శక్తివంతమైన నేత భయపడుతున్నారు. యుద్ధంపై అమెరికా-రష్యాలు చర్చలు జరిపితే అందులో ఉక్రెయిన్ పాల్గొనకపోతే ఎలా? అదే జరిగితే మా ప్రయోజనాలు దెబ్బతినట్లే. తన స్వలాభం కోసం పుతిన్ తన చర్యల ద్వారా డొనాల్డ్ ట్రంప్‌ను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన శాంతికి రష్యా కట్టుబడి ఉంటే యుద్ధానికి ముగింపు పలకొచ్చు. కానీ పుతిన్ ఆ పని మాత్రం చేయరు. ఉద్దేశ్యపూర్వకంగా చర్చలు జరపకుండా.. యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇష్టపడతారని'ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
శక్తివంతమైన నేత భయపడుతున్నారు : జెలెన్‌స్కీ ట్వీట్ !
January 29, 2025
0
Tags