ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలకు సంబంధించి 2024 - 25 విద్యా సంవత్సరానికి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదలయ్యింది. మార్చి నెలలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు గాను పరీక్షా తేదీలను వెల్లడించింది విద్యాశాఖ. మార్చి 17న మొదలు కానున్న పరీక్షలు మార్ఛి 31 లేదా ఏప్రిల్ 1 వరకు జరగనున్నట్లు తెలిపింది విద్యాశాఖ. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఫిజికల్ సైన్స్, బయలాజీకల్ సైన్స్ సబ్జెక్టులకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని.. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఆతెలిపింది విద్యాశాఖ. పరీక్షా షెడ్యూల్ ప్రకారం మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ కేలండర్‌లో మార్చి 31వ తేదీన రంజాన్ సెలవు దినంగా ఉన్న క్రమంలో నెలవంక మార్చి 31వ తేదీన కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది కాబట్టి.. సాంఘిక శాస్త్రం పరీక్షను ఏప్రిల్ 1న నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో మార్చి 17 నుంచి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ !
January 29, 2025
0
Tags