కంబోడియా లోని క్రేవుంగ్ తెగవారి వింత ఆచారం !

Telugu Lo Computer
0


కంబోడియా లోని రతనకిరి ప్రాంతానికి చెందిన క్రేవుంగ్ అనే తెగవారు ప్రపంచంలోనే వింతైన ఆచారాలను పాటిస్తున్నారు. ఆ తెగ లో ఉండే అమ్మాయిలకు 13 ఏట నుంచే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తారు. ఆ తెగ వాళ్ళు అమ్మాయి కి 13 - 15 ఏళ్ళు రాగానే వాళ్ళకి ఒక గుడిసె వేస్తారు, అందులో వారు ఒక్కరే ఉండాలి. ఆ అమ్మాయి కి నచ్చిన వాడితో కార్యం చెయ్యొచ్చు, ఎంత మందితో అయినా చెయ్యొచ్చు, ఆ అమ్మాయి కి నచ్చితేనే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి నచ్చిన వాడు దొరికే వరకు ఎంత మందితో అయినా కార్యం చేయొచ్చు. అక్కడి అబ్బాయిలు అమ్మాయిలని ఒప్పించే కార్యం లో పాల్గొంటారు. పెళ్లి కి ముందు అమ్మాయిలు ఎంత మందితో అయినా కార్యం లో పాల్గొనచ్చు, కానీ పెళ్లి అయ్యాక ఆమె అలా చెయ్యలేదు, కనీసం పెళ్లి అయ్యాక మనస్పర్థలు కూడా రావు ఆ తెగ లో, నచ్చిన వాడిని ఏరుకొని మరి పెళ్లి చేసుకుంటారు కనుక విడిపోడాలు లాంటివి అక్కడ ఉండవు, అమ్మాయిలకు బాహ్య ప్రపంచం, బ్రతుకుదెరువు, సామాజిక అంశాలు, సెక్స్ పైన అవగాహనా కోసమే ఈ పద్దతి పాటిస్తాం అని అక్కడ నివసించే వాళ్ళు తెలిపారు, ఇది అక్కడి సంప్రదాయం, ఇది తరతరాల నుండి కొనసాగుతుంది, అక్కడ అత్యాచార కేసులు నమోదు అవ్వలేదు, ఎవ్వరిని బలవంతం చేసిన కేసు లు కూడా నమోదు కాలేదు. అమ్మాయి నివసించే గుడిసెని లవ్ హట్స్ అంటారు, ఎంత మంది అబ్బాయిలు అయినా ఆ లవ్ హట్స్ కి రావొచ్చు, మాట్లాడొచ్చు, అమ్మాయికి ఇష్టం అయితే కార్యం కూడా చెయ్యొచ్చు, దీని పైన మానవ హక్కుల సంఘం కోపం గా ఉంది. చిన్న వయసులోనే అమ్మాయిలు గర్భం దాల్చ గల అవకాశం ఉన్నందున ఈ సంప్రదాయం మంచిది కాదని చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)