నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర

Telugu Lo Computer
0


దేశంలో క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ ను అమలు చేయనుంది. ఆఫ్ షోర్ ప్రదేశాల్లో కీలకమైన కణజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ ను చేపట్టనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయము తీసుకున్నారు. ఈ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడము, ఈ రంగంలో దేశ స్వాలంబనను సాధించడమే ఈ మిషన్ లక్ష్యం అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు కంపెనీలు ఈ తరహా వనరులు అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దేశీయంగా అరుదైన ఖనిజ నిలువలను అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. మరోవైపు సిహెచ్ వి మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే విత్తనాలు ధర లీటర్ కు 56.28 నుంచి 57.97 కి పెంచేందుకు ఆమోదం తెలిపినట్టు వైష్ణవు వెల్లడించారు. అదేవిధంగా బీహెవి మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే విత్తనాలు, చెరుకు రసం చెక్కర, చక్కెర సిరప్ నుంచి ఉత్పత్తి చేసే విత్తనాలు ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. పెట్రోల్లో ఇత్తనాలు కలపాలన్న లక్ష్యానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)