ప్రయాగ్‌రాజ్‌లో భక్తులకు నెట్‌వర్క్‌ సమస్యలు రాకుండా ఎయిర్‌టెల్‌ ప్రత్యేక చర్యలు !

Telugu Lo Computer
0


మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో భక్తులకు నెట్‌వర్క్‌ సమస్యలు రాకుండా ఎయిర్‌టెల్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంది. మొబైల్ కవరేజీని పెంచడానికి ప్రయాగ్‌రాజ్ నగరంలో 287 కొత్త సైట్‌లను ఎయిర్‌టెల్‌ ఇన్‌స్టాల్ చేసింది. ఇప్పటికే ఉన్న 340 సైట్‌లను ఆప్టిమైజ్ చేసి, అదనంగా 74 కిలోమీటర్ల ఫైబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్‌ సేవలు: కుంభమేళా ప్రాంగణం, భోజన ప్రాంగణం, హైవేలు, రైల్వే స్టేషన్‌లు, విమానాశ్రయం, హోటళ్లు, నగరం అంతటా అధిక ఫుట్‌ఫాల్ ప్రాంతాలను కవర్ చేయడానికి 78 యాక్టివ్ సెల్ ఆన్ వీల్స్ ను ఏర్పాటు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని జూసీ, ఆరైల్, సంగం ప్రాంతాల్లో ఏవైనా అత్యవసర పరిస్థితులకు త్వరగా స్పందించేందుకు ఎయిర్‌టెల్ మూడు వార్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏదైనా నెట్‌వర్క్ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన చర్యలు తీసుకునేందుకు ఎయిర్‌టెల్‌ సిద్ధంగా ఉంది. జనరేటర్లు, డీజిల్, ఇతర డివైజ్‌లు, అవసరమైన వనరులు ఉన్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌ను కూడా కంపెనీ మోహరించింది. అంతేకాకుండా, మహాకుంభమేళా ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు, భక్తులకు సహాయం చేయడానికి 780 కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రయాగ్‌రాజ్ ట్రాఫిక్ పోలీసులతో ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కియోస్క్‌లు భక్తులకు సాఫీగా వివిధ ప్రాంతాలకు చేరుకోవడానికి అవసరమైన సూచనలు డిస్‌ప్లే చేస్తాయి. భద్రతా చర్యలను తెలియజేస్తాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)