సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు దుర్మరణం !

Telugu Lo Computer
0


సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు దుర్మణం పాలయ్యారు. ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రమాదంపై స్థానిక అధికారులతో మాట్లాడుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ విచారం వ్యక్తం చేశారు. జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నామన్న జైశంకర్ ఈ విషాద పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)