ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అనుచరుడి పై ఫోక్సో, అత్యాచారం కేసు నమోదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడిపై ఫోక్సో, అత్యాచార కేసు నమోదు అయ్యింది. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు వడ్ల దాదాపీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపీర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరు లేని సమయంలో ఇంటికి వచ్చి లొంగదీసుకుని శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించారని బాధితురాలు వెల్లడించింది. తనను లైంగికంగా వేధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఆఖరికు తన నిశ్చితార్థాన్ని కూడా చెడకొట్టాడని కన్నీటిపర్యంతమైంది. వడ్ల దాదాపీర్ నుంచి రక్షణ కల్పించాలని యువతి పోలీసులను ఆశ్రయించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాదాపీర్‌ను అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)