ఎక్స్ ప్రెస్ మంత్లీ పాస్ ఉన్నవారు డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు !

Telugu Lo Computer
0


తెలంగాణలో ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ ఉన్న వాళ్లు సైతం ఇక డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. 'ఎక్స్‌ ప్రెస్‌ మంత్లీ సీజన్‌ టికెట్‌ పాస్‌దారులకు శుభవార్త! ఈ పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును #TSRTC కల్పించింది. రూ.20 కాంబినేషన్‌ టికెట్‌ తీసుకుని డీలక్స్‌ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చు. ఎక్స్‌ ప్రెస్‌ పాస్‌ దారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈ కాంబినేషన్‌ టికెట్‌ సదుపాయాన్ని వినియోగించుకుని డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించాలని సంస్థ కోరుతోంది. వంద కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే ఈ పాస్‌ కావాలనుకునే వారు టీఎస్‌ఆర్టీసీకి చెందిన స్థానిక బస్‌ పాస్‌ కౌంటర్లను సంప్రదించగలరు'అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కేవలం కాంబినేషన్ టికెట్‌తో ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ దారులు ఇక డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చునన్న మాట. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డీలక్స్ బస్సులకు ఇది వర్తిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)