చైనాకు చెందిన ఓ యువకుడు తాను ప్రేమించిన యువతికి పెళ్ళికి ముందు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆమెను ఆ యువకుడు వివాహం చేసుకోవాలంటే పెళ్ళికి ముందే ఆమెకు ప్లాట్ కొనివ్వాలని యువతి తల్లిదండ్రులు అతనికి షరతు పెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని సదరు ప్రియుడు ఓ ప్లాన్ వేశాడు. రూ. 80 లక్షల నకిలీ నోట్లను సూట్‌కేసులో పెట్టి యువతికి అందజేశాడు. ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేద్దామని వెళ్లిన గర్ల్‌ఫ్రెండ్‌కు ఊహించని షాక్ తగిలింది. అవి నకిలీ కరెన్సీ అని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు బ్యాంకు సిబ్బంది. దాంతో అక్కడికి వచ్చిన పోలీసులు సూట్‌కేస్‌ను తెరిచి చూడగా, పైన కొంతమేర అసలు నోట్లు పెట్టి మిగతా అంతా నకిలీ నోట్లతో నింపినట్లు గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించిన సదరు వ్యక్తి.. గర్ల్‌ఫ్రెండ్ పేరెంట్స్ పెట్టిన కండిషన్‌ను తీర్చడానికి తనవద్ద అంత భారీ మొత్తం లేకపోవడంతో ఇలా ఫేక్ కరెన్సీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.
పెళ్ళి కొరకు ప్రేయసికి రూ. 80 లక్షల నోట్లను ఇచ్చిన ప్రియుడు !
May 06, 2024
0
Tags