ఉగ్రవాద స్థావరమైన జెనిన్‌లోని అల్-అన్సార్ మసీదుపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వైమానిక దాడులు జరిపింది. పౌరులపై దాడులు జరిపేందుకు ఈ మసీదు నుంచే ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులకు పాల్పడింది. దీనిపై తమ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రమూకలపై ఈ దాడి జరిపినట్లు వారు పేర్కొన్నారు. ఇద్దరు బందీలను విడిచిపెట్టిన తరువాత తామొక మానవతా సంస్థగా చెప్పుకునేందుకు హమాస్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. హామాస్ ఐసిస్ కంటే దారణమైన సంస్థ అనే విషయాన్ని ప్రపంచం మరిచిపొదన్నారు. గాజా స్ట్రిప్ ప్రజలను హమాస్ రక్షణ కవచంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. పౌరుల మౌలిక సదుపాయాలపై రాకెట్లతో దాడి చేస్తోందని దుయ్యబట్టారు. గాజాపై దాడులను మరింత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. హమాస్‌పై యుద్ధాన్ని తరువాతి దశకు తీసుకువెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. గాజా స్ట్రిప్ దాడి చేసినప్పుడుల్లా ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకుంటుదని హెజ్బొల్లా హెచ్చరించింది. ప్రస్తుతం తాము ఈ పోరాటంలోనే ఉన్నామని హెజ్బొల్లా డిప్యూటీ లీడర్ షేక్ నయీమ్ కస్సెమ్ తెలిపారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతోంది.
ఉగ్రవాదులే లక్ష్యంగా మసీదుపై ఇజ్రాయెల్ దాడులు !
October 22, 2023
0
Tags