లూనా 25 ఫెయిల్యూర్ తో మిఖాయిల్ మారోవ్ ఆస్పత్రిపాలు

Telugu Lo Computer
0


రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లూనా 25 మూన్ మిషన్ ఫెయిల్యూర్ తర్వాత ఆ దేశ సైంటిస్ట్ మిఖాయిల్ మారోవ్ (90) ఆస్పత్రి పాలయ్యారు. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ పంపిన లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ ఈ నెల 20న చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. ఇది తెలిసి మారోవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను మాస్కోలోని ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఆస్పత్రిలో మీడియాతో మారోవ్ మాట్లాడారు. ''ప్రస్తుతం నేను అబ్జర్వేషన్​లో ఉన్నాను. లూనా 25 ఫెయిల్యూర్​తో చాలా బాధపడుతున్నా. స్పేస్ క్రాఫ్ట్ క్రాష్​ ల్యాండ్ కావడంతో దు:ఖాన్ని తట్టుకోలే కపోతున్నా. లూనా 25 వైఫల్యానికి గల కారణాలపై సైంటిస్టులు చర్చిస్తారని ఆశిస్తున్నాను' అని మారోవ్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)