చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం లింక్స్ !

Telugu Lo Computer
0


చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు వీలుగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ఇవాళ చంద్రుడిపై అడుగుపెట్టే చారిత్రక క్షణాలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అరుదైన దృశ్యాల్ని దేశ ప్రజలు, ముఖ్యంగా విద్యార్ధులు లైవ్ లో వీక్షించేందుకు వీలుగా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం తమ వైబ్ సైట్ తో పాటు పలు సోషల్ మీడియా నెట్ వర్క్ లలోనూ లింక్స్ ను అందుబాటులోకి తెచ్చింది. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే సాయంత్రం 5.27 నిమిషాల నుంచి ల్యాండింగ్ పూర్తయ్యే వరకూ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లింక్స్ ను ఇస్రో ఇవాళ షేర్ చేసింది. వీటితో పాటు తమ వెబ్ సైట్ లోనూ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని అందుబాటులో ఉంచుతోంది. దీంతో సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ చారిత్రక క్షణాల్ని లైవ్ లో వీక్షించేందుకు వీలు కలుగుతోంది. సాయంత్రం 6.04 నిమిషాలకు జరుగుతుందని భావిస్తున్న విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ ప్రక్రియను దూరదర్శన్ తో పాటు ప్రసార భారతికి చెందిన అన్ని నెట్ వర్క్ లను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు స్పేస్ డాట్ కామ్ (space.com),ఇస్రో వెబ్ సైట్ https://www.isro.gov.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే యూట్యూబ్, ఫేస్ బుక్, లింక్స్ ను కూడా ఇస్రో షేర్ చేసింది. ISRO Website: YouTube, Facebook: DD National TV ఇస్రో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్ధలు ఈ లైవ్ స్ట్రీమింగ్ ను విద్యార్ధులకు ఏర్పాటు చేయాలని కోరింది. విద్యార్ధుల్లో శాస్త్రవిజ్ఞానంపై అవగాహన పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్ధలు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)