ర్యాగింగ్ పేరుతో క్రూరంగా హింసించారు !

Telugu Lo Computer
0


కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ (జెయు) లో మరణించిన మొదటి ఏడాది విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో క్రూరంగా హింసించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హాస్టల్‌ కారిడార్‌లో నగ్నంగా ఊరేగించడంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి మంగళవారం తెలిపారు. యూనివర్శిటీ ప్రస్తుత, మాజీ విద్యార్థులతో సహా మొత్తం 12 మందిని వేధింపులకు గురిచేశారని పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. '' రూమ్‌ నెం-70 వద్ద యువకుడిని ర్యాగింగ్‌ చేసినట్లు, లైంగికంగా వేధించినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయి'' అని అన్నారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అరెస్టయిన నిందితుల్లో ఒకరు నకిలీ వాట్సాప్‌ గ్రూప్‌ను సృష్టించారని అన్నారు. నిందితులు ర్యాంగింగ్‌ ఘటన వెలుగులోకి రాకుండా చేసేందుకు యత్నించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హాస్టల్‌లో వంట చేసే వ్యక్తిని కూడా విచారించామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు విద్యార్థులకు సమన్లు జారీ చేశామని అన్నారు. ఈ నెల 9న జాదవ్‌పూర్‌ యూనివర్శిటీకి చెందిన ఓవిద్యార్థి బాలుర హాస్టల్‌ రెండో అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను లైంగిక వేధింపులకు, ర్యాంగిగ్‌కు గురయినట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)