పుష్ప 2 నుంచి జాలి రెడ్డి పోస్టర్ రిలీజ్ !

Telugu Lo Computer
0


సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ బాక్సాపీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో పుష్ప2 మూవీ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు తమ టాలెంట్ తో ఫ్యాన్స్ కు గుర్తిండిపోయేలా యాక్ట్ చేశారు. ఈ మూవీలో జాలిరెడ్డిగా నటించిన ధనంజయ అందరికి ఫేమసే. ముఖ్యంగా పుష్పలో రష్మిక మందనను తీసుకెళ్లే సీన్స్, అల్లు అర్జున్ ఫైట్ సీన్స్ తో ధనంజయ బాగా గుర్తిండిపోయారు.లేటెస్ట్ గా పుష్ప 2 మూవీ నుంచి యాక్టర్ ధనంజయ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప లో చాలా మాస్ లుక్ లో..నల్ల చొక్కా ధరించి,నుదిట బొట్టు పెట్టుకుని అగ్రెసివ్ గా కనిపించారు జాలిరెడ్డి..ఇక పుష్ప2 లో సింపుల్ గా ఆకట్టుకుంటున్నారు. ఇవాళ (ఆగస్టు 23) బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ఈ ధనంజయ్ లుక్ ఆకట్టుకుంటుంది. మేకర్స్ లుక్ రిలీజ్ చేస్తూ..పుష్ప 2లో జాలీ రెడ్డి ఈసారి స్కోర్‌లను సెటిల్ చేయడానికి తిరిగి వస్తాడు అంటూ..పుష్ప 2 ది రూల్ నుంచి విషెస్ తెలియజేశారు. పుష్ప2 సినిమా విషయానికి వస్తే... నేషనల్ క్రష్ రష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)