భారత్‌ లేకుండా భద్రతా మండలి పరిపూర్ణం కాదు !

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌ పర్యటనకు బయల్దేరే ముందు ప్రముఖ ఫ్రెంచ్‌ డెయిలీ లెస్‌ ఎకోస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై భారత్‌ పోషిస్తున్న కీలక పాత్రను మరోసారి వివరించారు. ''అత్యధిక జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌, ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కానప్పుడు ఆ మండలి ప్రపంచం కోసం ఎలా మాట్లాడగలదు?'' అని ప్రశ్నించారు. ఐరాస భద్రతా మండలిలో ఎలాంటి మార్పులు జరగాలి? ఇందుకోసం తాము ఎలాంటి పాత్ర పోషించాలి అన్నదానిపై భారత్‌తో సహా చాలా దేశాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ''యోగా అనేది ఇప్పుడు మన నిత్య జీవితంలో భాగమైంది. మా సంప్రదాయ ఔషధమైన ఆయుర్వేదాన్ని ప్రపంచమంతా ఆమోదిస్తోంది. మా నిపుణులు ఎన్నడూ యుద్ధం, అణచివేత వంటి వాటికి పాల్పడలేదు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, శాస్త్రం, గణితం వంటి ప్రజా ఉపయోగకర అంశాలపైనే దృష్టి సారించారు'' అని మోడీ ఈ సందర్భంగా తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై స్పందిస్తూ.. ''ఈ ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు భారత్‌ సుముఖంగా ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఇరు దేశాధినేతలు పుతిన్‌, జెలెన్‌స్కీకి చాలా సార్లు చెప్పా. ఇది యుద్ధాల యుగం కాదని పునరుద్ఘాటిస్తున్నా, దౌత్యపరమైన చర్యలతో సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆ రెండు దేశాలను కోరుతున్నాం'' అని మోడీ  మరోసారి స్పష్టం చేశారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని అన్నారు. ఇప్పటికే కొవిడ్‌ మహమ్మారితో కుదేలైన దేశాలు, ఇప్పుడు ఆహారం, విద్యుత్తు కొరత, ఆహార సంక్షోభం, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. అందుకే ఈ యుద్ధాన్ని ముగించాలని పిలుపునిచ్చారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)